మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్‌చేంజర్’. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనేవుంది. శంకర్ ‘భారతీయుడు’ ఫ్రాంచైజీతో బిజీ కావడమే ఈ జాప్యానికి కారణం. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా నిర్మాణంలో వేగం పెంచారు దర్శకుడు శంకర్. సునీల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన నేపథ్యంలోసాగే సన్నివేశాలను చిత్రీకరించారు.
తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి షురూ చేశారు. రామ్‌చరణ్ లేని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో పూర్తి చేస్తారని సమాచారం. దీనికోసం సెకండ్ యూనిట్‌ను నియమించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి కథానాయికలు. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నరేశ్, సముద్రఖని, నాజర్, ప్రియదర్శి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాత: దిల్‌రాజు.