Game Changer | రా మచ్చా మచ్చా.. 28న గేమ్ చేంజర్ రెండో పాట ప్రోమో
రామ్‌చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్' క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా..
Game Changer | రామ్‌చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా.. పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ఇప్పటి నుంచే ప్రచారపర్వాన్ని వేగవంతం చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘జరగండి జరగండి’ మంచి ఆదరణ దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తమన్ స్వరపరచిన చేసిన ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రచించారు. హుషారైన బీట్తో సాగే మాస్ పాట ఇదని చిత్ర బృందం పేర్కొంది. రాజకీయ, సామాజికాంశాలను చర్చిస్తూ తనదైన శైలి సందేశంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, దర్శకత్వం: శంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

