KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కేటీఆర్‌కి బర్త్‌డే విషెస్ తెలిపాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రజాసేవలో మరెన్నో గొప్ప సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నానంటూ రామ్ చరణ్ రాసుకోచ్చాడు.
సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.
Happy Birthday to @KTRBRS Garu.
Wishing you many more glorious years in public service. Best wishes.
— Ram Charan (@AlwaysRamCharan) July 24, 2025