యువ కథానాయకుడు రోషన్ కనకాల నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అగ్ర హీరో రామ్‌చరణ్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
హీరో నాని వాయిస్‌తో ఈ గ్లింప్స్ మొదలవ్వడం విశేషం. రోషన్ రగ్గడ్ అవతారంలో ఆకట్టుకున్నాడు. సాక్షి మడోల్కర్ కథానాయికగా, బండి సరోజ్‌కుమార్ విలన్‌గా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 2025లో అటవీ నేపథ్యం సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్టు గ్లింప్స్ చెబుతున్నది. అటవీ నేపథ్య సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి.ఎం, సంగీతం: కాలభైరవ.