Ram Charan: టామ్ క్రూజ్‌ను కలవాలనుకుంటున్నా: రామ్‌చరణ్
Ram Charan:తన ఫెవరేట్ హీరో టామ్ క్రూజ్‌ను రాంచరణ్ కలవాలనుకుంటున్నాడు. ఆదివారం జరిగే ఆస్కార్స్ వేడుకల్లో అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడు. క్రూజ్ నటించిన టాప్ గన్ మూవీని చూసినట్లు రాంచరణ్ చెప్పాడు.
హైదరాబాద్: టాలీవుడ్ హీరో రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. ఆదివారం జరిగే ఆస్కార్స్(Oscars) వేడుక కోసం అతను ప్రిపేరవుతున్నాడు. ఆర్ఆర్ఆర్(RRR) ఫిల్మ్ ఆ అవార్డ్స్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే అత్యంత గ్రాండ్‌గా జరిగే ఆస్కార్స్ వేడుక వేళ.. తనకు ఇష్టమైన హాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్‌తో రామ్ చరణ్ భేటీ కావాలనుకుంటున్నాడు.
Ram Charan from #RRR is "especially" excited to see Cate Blanchett and Tom Cruise this Oscars Sunday! pic.twitter.com/TRMxXp8Tax
— Entertainment Tonight (@etnow) March 8, 2023
ఆస్కార్స్ రెడ్‌కార్పెట్‌కు ఎలా వెళ్తానో తెలియదు కానీ.. ఆ మెగా ఈవెంట్‌కు హాజరుకావాలన్న ఉత్సాహం తనలో ఉన్నట్లు రామ్‌చరణ్ తెలిపారు. ఇక వేడుకల్లో ఎవర్ని కలవాలనుకుంటున్నట్లు అడిగిన ఓ ప్రశ్నకు రామ్ సమాధానం ఇచ్చారు. హాలీవుడ్ స్టార్స్ సినిమాలను చూస్తూ ఎదిగానని, అయితే నటి కేట్ బ్లాంకెట్, నటుడు టామ్ క్రూజ్(Tom Cruise)లను ఈ వేడుక వేళ ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నట్లు రాంచరణ్ చెప్పాడు.
గత ఏడాది రిలీజైన టాప్‌గన్(Top Gun) మూవీలో టామ్ క్రూజ్ నటించిన విషయం తెలిసిందే. ఆ ఫిల్మ్‌ను చూశానని, క్రూజ్ నటన అద్భుతమని రాంచరణ్ అన్నాడు.
ఇక ఈ యేటి ఆస్కార్స్‌లో.. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ పోటీపడుతోంది. ఆ ఫిల్మ్‌లోని నాటు నాటు సాంగ్(naatu naatu song).. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గట్టి పోటీ ఇవ్వనున్నది. హాలీవుడ్ విశ్లేషకుల ప్రకారం నాటు నాటు సాంగ్‌కు అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

