Ram Charan | టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు తండ్రి శ్యామ్‌సుందర్‌రెడ్డి సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామ్‌సుందర్ రెడ్డి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు దిల్రాజును పరామర్శించారు. కాగా తాజాగా రామ్‌చరణ్ శ్యామ్‌సుందర్‌రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం దిల్రాజును పరామర్శించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక దిల్‌రాజు బ్యానర్లో రామ్‌చరణ్ ఇప్పటికే ఎవడు అనే యాక్షన్ సినిమా చేశాడు. ప్రస్తుతం గేమ్‌చేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా రోజుల తర్వాత సోమవారం ఓ మేజర్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ముందుగా సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్నా.. శంకర్ మరోవైపు ఇండియన్-2పై దృష్టి పెట్టడంతో గేమ్ చేంజర్ షూటింగ్‌కు ఆలస్యమవుతుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఎస్.జే సూర్య వంటి స్టార్ కాస్ట్ నటిస్తుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
#RamCharan garu visited #DilRaju’s home and paid his last respects to Sri Shyam Sundar Reddy’s departed soul and consoled his family pic.twitter.com/atzroEqFeU
— Shreyas Media (@shreyasgroup) October 10, 2023