Ram Charan | గాయంతోనే సెట్స్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌తో సెల్ఫీ వీడియో!
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అంకితభావంతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్ చేస్తూ చరణ్‌కు గాయమైన సంగతి తెలిసిందే. ఆ గాయానికి చిన్న సర్జరీ కూడా జరిగినప్పటికీ, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా తిరిగి షూటింగ్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అంకితభావంతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్ చేస్తూ చరణ్‌కు గాయమైన సంగతి తెలిసిందే. ఆ గాయానికి చిన్న సర్జరీ కూడా జరిగినప్పటికీ, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా తిరిగి షూటింగ్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. మార్చి 27న, తన పుట్టినరోజు సందర్భంగా చరణ్ మళ్లీ సెట్స్‌లో కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అయింది. కంటిపైన బ్యాండేజ్ ఉన్నప్పటికీ, ఆయన ముఖంలో ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు. అయ్యప్ప మాల దీక్షలో భాగంగా నల్లటి దుస్తులు, రుద్రాక్షలు ధరించి, జుట్టును ముడివేసుకుని కనిపించిన చరణ్, అభిమానులతో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆయనను చూడటానికి పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులను నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, “మా కల నెరవేరింది” అంటూ పోస్టులు చేస్తున్నారు. సెట్స్ వద్ద అభిమానుల కోసం ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. మార్చి 27న 41వ వసంతంలోకి అడుగుపెట్టిన చరణ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక గాయం విషయానికి వస్తే, యాక్షన్ సీన్ చిత్రీకరణలో భాగంగా చరణ్ ఎడమ కంటిపైన గాయమై నాలుగు కుట్లు పడినట్లు ఆయన టీమ్ వెల్లడించింది. అయితే, కంటికి పెద్ద ప్రమాదం ఏమీ లేదని, ఆయన పూర్తిగా సేఫ్‌గా ఉన్నారని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై నిహారిక కొణిదెల కూడా స్పందించారు. తిరుపతిలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఈ విషయం తెలిసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. “ఇలా ఒక్కసారిగా చెప్పేస్తారా సార్?” అంటూ ఆమె ఆ క్షణంలో ఎమోషనల్‌గా స్పందించిన వీడియో వైరల్ అయింది.మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ, చరణ్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సరైన సమయంలో చేసిన నైపుణ్యంతో కూడిన చికిత్స వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైన గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కొనసాగిస్తూ, అభిమానులతో సమయం గడిపిన రామ్ చరణ్ మరోసారి తన డెడికేషన్‌ను నిరూపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

