Ram Charan: వాక్సినేషన్ సెంచరీపై రామ్ చరణ్ ట్వీట్

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేస్తూ 100 కోట్ల వాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని “వాక్సినేషన్ సెంచరీ” అనే హిస్టారికల్ మూమెంట్ ని నమోదు చేసింది.టీకాల పంపిణీలో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ… ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. నిజానికి చెప్పాలంటే అభివృద్ధి చెందిన ఏడు దేశాలు ఒక నెలలో ఎన్ని టీకాలు వేసాయి.. వాటి కన్నా మించిన మొత్తంలో టీకాల పంపిణీ వేసి భారత్ రికార్డు సృష్టించింది.
అరుదైన ఘనత సాధించడానికి అహర్నిషలు పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్, మెడికల్ టీం అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇండియా వారిని కొనియాడారు. రీసెంటగా పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 15 చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

