Ram Charan | సోదరిని సంతోషంగా ఉంచేందుకు రాంచరణ్ ట్రిప్..!
సోషల్‌మీడియాలో ఓ వైపు విడాకుల గాసిప్స్ గుప్పుమంటుంటే..మరోవైపు అవేవి పట్టనట్టుగా శ్రీజ-కల్యాణ్ దేవ్ (Sreeja-Kalyaan Dhev) కపుల్ ఎవరి బిజీలో వారున్నారు.

కొన్ని రోజులుగా టాలీవుడ్ (Tollywood) హీరో చిరంజీవి కూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్ (Sreeja-Kalyaan Dhev) కపుల్ విడాకులు తీసుకోబోతున్నారంటూ (divorce rumours) వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌మీడియాలో ఓ వైపు గాసిప్స్ గుప్పుమంటుంటే..మరోవైపు అవేవి పట్టనట్టుగా శ్రీజ, కల్యాణ్ దేవ్ ఎవరి బిజీలో వారున్నారు. కల్యాణ్ దేవ్ తాజాగా జిమ్‌లో ట్రాన్స్ ఫార్మామేషన్ స్టిల్‌ను షేర్ చేస్తూ..తాను వర్కవుట్‌తో బిజీగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఇంకోవైపు విడాకుల వార్తల నేపథ్యంలో సోదరి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పక్కనే ఉన్నాడు రాంచరణ్ (Ram Charan) .
ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరు ముంబైలో ప్రత్యక్షమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చరణ్ తో కలిసి ప్రైవేట్ ఫ్లైట్‌లో దిగిన స్టిల్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. శ్రీజ తన ఒడిలో పెట్ రైమ్‌ను పట్టుకుని ఉండగా..పక్కనే స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న చరణ్ ఆమెతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటో దిగాడు. సంతోషంగా జీవించేందుకు ఉపయోగపడే చిన్న చిన్న విషయాలు..కౌగిలింతలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది శ్రీజ. నన్నువిడిచి వెళ్తున్నందుకు ధన్యవాదాలు అంటూ చరణ్ మరో సోదరి సుస్మిత కామెంట్పెట్టింది.

సోషల్ మీడియా ఖాతాల్లో శ్రీజ తన సర్ నేమ్ తొలగించడంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. శ్రీజ, కల్యాణ్ దేవ్ ఒకరికొకరు అన్ ఫాలో అయ్యారు. ఈ వార్తలపై కొణిదెల కుటుంబం మాత్రం సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూనే..మరోవైపు శ్రీజను సంతోషంగా ఉంచేందుకు ప్లాన్ చేసిందని తాజా ఫొటోలతో అర్థమవుతుందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

