Ramcharan | మహేశ్ బాబు మేనల్లుడి సినిమాకు రామ్ చరణ్ రివ్యూ..

Ramcharan | కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. దాంతో మన హీరోలు అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. అనుకోకుండా ఖాళీ సమయం దొరకడంతో సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ అయితే తనకు దొరికిన సమయం పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. కొత్తగా విడుదలైన ప్రతి సినిమా చూసి సోషల్ మీడియాలో తన రివ్యూ పోస్ట్ చేస్తున్నాడు. మొన్నామధ్య నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి హీరో హీరోయిన్లను పొగడ్తలతో ముంచెత్తాడు. దానికి సాయి పల్లవి కూడా రిప్లై ఇచ్చి.. మా కోసం టైం కేటాయించినందుకు సంతోషం అంటూ ట్వీట్ చేసింది. తన అక్క సుస్మితా కొణిదెల నిర్మించిన సేనాపతి విషయంలో కూడా ఇలాగే స్పందించాడు రామ్ చరణ్. ఇక ఇప్పుడు మరో సినిమా చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని పోస్ట్ చేశాడు.
మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమైన సినిమా హీరో. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం ఊహించనంతగా రావడం లేదు. ఇప్పుడు ఈ సినిమా చూసిన రామ్ చరణ్ తన రివ్యూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన గల్లా అశోక్ కు ఆల్ ద బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు చరణ్. అలాగే నిర్మాతలు పద్మావతి, జయదేవ్ గల్లాకు తన బెస్ట్ విషెస్ చెప్పాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ప్రశంసించాడు. రామ్ చరణ్ నుంచి వచ్చిన ఈ రివ్యూ చూసి పండగ చేసుకుంటున్నారు హీరో టీం. తమ సినిమా ప్రమోషన్ కోసం ఇది వాడుకుంటున్నారు. ఏదేమైనా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు చూసి తన అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

