రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిదే. జాన్వీకపూర్ కథానాయిక. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏ.ఆర్.రెహమాన్ స్వరకర్త.
కొద్ది మాసాల క్రితం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో క్రీడా నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రామ్‌చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్ట్‌లో మొదలుపెట్టబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. అనంతరం బుచ్చిబాబు సినిమా కోసం రామ్‌చరణ్ సన్నద్ధం అవుతారని చెబుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: అవినాష్ కొల్లా, పాటలు: చంద్రబోస్, అనంత శ్రీరామ్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, దర్శకత్వం:
బుచ్చిబాబు సానా.