అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్ తనదైన పంథాలో సామాజికాంశాలను చర్చిస్తూ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ ఐ.ఏ.ఎస్ అధికారి పాత్రలో కనిపిస్తారని సమాచారం. తన సినిమాల్లో హీరోలను కథానుగుణంగా విభిన్న గెటప్స్‌లో చూపించడం దర్శకుడు శంకర్ ఆనవాయితీ. ‘గేమ్ ఛేంజర్’లో కూడా ఆయన అదే సూత్రాన్ని ఫాలో అయ్యారని చెబుతున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఏడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని చెబుతున్నారు. సామాజిక సమస్యలను చర్చించడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను చూపించే ధీరోదాత్తుడైన వ్యక్తిగా రామ్‌చరణ్ పాత్ర సాగుతుందని తెలిసిది. ఈ క్రమంలోనే ఆయన ఏడు గెటప్స్‌లో దర్శనమివ్వబోతున్నారని సమాచారం.