Ram charan | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దశాబ్దాల కలను నెరవేర్చుకొని.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana formation day) సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
దశాబ్ది ఉత్సవాలపై తన సందేశాన్ని అందరితో పంచుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి.. బంగారు తెలంగాణ కలను నిజం చేసుకుంటున్నాం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సోదరసోదరీమణులందరికి నా శుభాకాంక్షలు..’ అని ట్వీట్ చేశారు రాంచరణ్.
తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు…
— Ram Charan (@AlwaysRamCharan) June 2, 2023
ఈ నెల 22 వరకు దశాబ్ది ఉత్సవాలు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 3న రైతు దినోత్సవం, 4న పోలీసు శాఖ సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు, 6న పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్లలో సభలు, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20 విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరులకు నివాళి, స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.