SSMB29 | అగ్ర నటుడు రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్‌లో నటించిన ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగగా.. సినిమపై అంచనాలను మరింత పెంచింది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌కి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు.
అయితే ఈ వేడుకలో యాంకర్ సుమ రాజమౌళి ముందు రామ్ చరణ్‌ని అడుగుతూ.. చరణ్ గారు మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పగలుగుతారా అని అడుగుతుంది. దీనికి రామ్ చరణ్ సమాధానమిస్తూ.. మళ్లీ కోవిడ్ లాంటివి ఉంటే లేట్ అవుతుందేమో కానీ ఇప్పుడు అవి లేవు కదా.. ఏడాదిన్నరలోపు ఈ సినిమా వచ్చేస్తుంది అంటూ రామ్ చరణ్ చెప్పుకోచ్చాడు. దీంతో పక్కనే రాజమౌళి మాట్లాడుతూ.. బాగానే ట్రైనింగ్ ఇచ్చాను అందుకే ఇలా చెబుతున్నాడు అంటూ నవ్వులు పూయించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
“If no pandemic hits, then #SSMB29 will release within 1 1/2 year”
– #RamCharan at #GameChanger trailer launch event#MaheshBabu pic.twitter.com/iH3AvRp9lc— VardhanDHFM (@_VardhanDHFM_) January 2, 2025