Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానతో కలిసి తన 16వ చిత్రం పెద్దిలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకోగా, తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.చరణ్ కెరీర్లో 17వ సినిమాగా దర్శకుడు సుకుమార్‌తో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. గతంలో సుకుమార్ – చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన 17వ సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ జూన్‌లో విడుదల కానుండగా, అదే నెలలో సుకుమార్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సుకుమార్ తన ప్రత్యేకమైన కథనం, డిఫరెంట్ టేకింగ్‌తో సినిమాలను తెరకెక్కించడంలో పాపులర్ కాగా, రామ్ చరణ్ కూడా తన నటనతో ప్రేక్షకులని మరింత అలరించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా మరోసారి ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదిఏమైన ‘పెద్ది’ తర్వాత గ్యాప్ లేకుండా చరణ్ కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడనే వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.