మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పుడో విడదల కావలసిన ఈ సినిమా కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. సెకండ్ వేవ్ వలన కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు కరోనా కాస్త తగ్గడంతో తిరిగి ప్రారంభించారు. గత వారమే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, ముంబై నుండి తన కోసం వచ్చిన స్పెషలిస్ట్ హెయిర్ స్టైలీష్ట్‌తో సెట్లో ఫొటో దిగాడు. ఈ పిక్ వైరల్ అయింది.
ఇక తాజాగా సెట్లో ఓ పిల్లాడితో రామ్ చరణ్ సరదాగా సంభాషిస్తున్న పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో క్లాస్ అండ్ స్టైలీష్‌గా ఉన్న రామ్ చరణ్‌ను చూసి అభిమానులు మురిసిపోతోన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్విట్టర్లో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. కాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్ని పూర్తి కాగా, దాదాపు 350 కోట్లకు పైగానే అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.