రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం ఈ చిత్ర టీజర్‌ను అగ్రహీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. ఇందులో విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా రాజ్‌తరుణ్ కనిపించారు. పందెం కాయడం, బెట్టింగ్, పేకాట, రికార్డింగ్ డ్యాన్సులతో జీవితాన్ని గడిపే సరదా యువకుడిగా ఆయన పాత్రను చూపించారు. ‘వాడి పుంజు బరిలో ఉండగా..ఇంకొకడు గెలవడం కష్టం’ అనే డైలాగ్ ఆయన పాత్ర తీరుతెన్నుల గురించి తెలియజేసేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో థియేటర్లలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాగేష్ బానెల్, సంగీతం: గోపీసుందర్, నిర్మాత: సుప్రియ యార్లగడ్డ, రచన-దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి.