RC15 Movie Title | గేమ్‌ఛేంజర్‌గా రామ్‌చరణ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ వీడియో
RC15 Movie Title | మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘RC15’. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
RC15 Movie Title | మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘RC15’. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన తిరుగులేని క్రేజ్‌ను.. ఈ సినిమాతో మరింత పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ వైపు శంకర్ కూడా హిట్టు చూసి చాలా కాలమే అయింది. ఈ సినిమాతో ఎలాగైన భారీ విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే సోమవారం రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ విడుదల చేశారు. రాజకీయ ఆటలో చరణ్ గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నారనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని టైటిల్ వీడియోతోనే చిత్రబృందం స్పష్టం చేసింది. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు కథను అందించాడు. చరణ్‌కు జోడీగా కియారా అద్వాణి నటిస్తుంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Happy birthday to the worldwide charmer @AlwaysRamCharan being fierce and daring on screen and a darling off screen makes you a #gamechanger @SVC_official @advani_kiara @MusicThaman @DOP_Tirru pic.twitter.com/t0wLwN8tc0
— Shankar Shanmugham (@shankarshanmugh) March 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

