Ram Charan | భారత ఆర్చరీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరలేపిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఘనంగా ప్రారంభించారు. అక్టోబర్ 2న న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంగరంగ వైభవంగా ఈ లీగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న చరణ్, ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్రాంచైజీ తరహాలో తొలిసారిగా జరుగుతున్న APL– దేశంలోని అగ్రశ్రేణి రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కూడిన 6 జట్ల మధ్య జరగనుంది. మొత్తం 48 మంది ఆటగాళ్లు, ప్రతి జట్టులో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
ఇదే తొలి సారి రికర్వ్ కాగా, కాంపౌండ్ ప్లేయర్లు ఒకే జట్టులో పోటీ పడనుండటం, అది కూడా ఫ్లడ్లైట్స్ లో జరగడం ఈ లీగ్‌కు ప్రత్యేకతను చేకూర్చింది. రామ్ చరణ్ మెగా ఎంట్రీతో ప్రారంభోత్సవ వేడుకలో అభిమానుల ఆనందం అవధులు దాటింది. చాలా మంది సెల్ఫీ కోసం పోటీ పడ్డారు. ఇక రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “పెద్ది”**లో రస్టిక్ లుక్‌లో కనిపించనుండగా, అదే లుక్‌తో ఈ ఈవెంట్‌కి హాజరవడం విశేషం. లాంగ్ హెయిర్, గడ్డం లుక్‌తో రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ ఎప్పుడూ అభిమానులకు చేరువగా ఉండే వ్యక్తిత్వం కలిగిన హీరోగా పేరు పొందారు. హిట్లు, ప్లాప్లను దాటి ఆత్మీయతను గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం చూసి అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. “మా హీరో ఏ రంగంలోనైనా స్పూర్తిదాయకంగా ఉంటారు” అంటూ సోషల్ మీడియాలో అభిమానుల పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ లీగ్‌కు వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, భారత క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు ప్రకటించాయి. అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ లీగ్, దేశంలో ఆర్చరీ పట్ల ఉన్న ఆసక్తిని పెంచడమే కాకుండా, యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశం కల్పించనుంది.
Adem AURA & Masss 🥵💥 Appeals Ayya Saami @AlwaysRamCharan 🦁🔥#RamCharan at #ArcheryPremierLeague Delhi 🔥 pic.twitter.com/bVnevWJIGv
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 2, 2025