అగ్ర హీరో రామ్‌చరణ్ తన 16వ సినిమా కోసం కసరత్తులు ఆరంభించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమా కోసం రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో సిద్ధమవుతున్నారు. శారీరకంగా మరింత దృఢంగా కనిపించేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఆయన స్పోర్ట్స్ కోచ్‌గా కనిపిస్తాడని, పాత్రకు అనుగుణంగా సూపర్ఫిట్గా కనిపిస్తాడని చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఫిట్నెస్ ట్రైనర్స్‌తో కలిసి శిక్షణ తీసుకుంటున్న ఓ ఫొటోను రామ్‌చరణ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘ఆర్సీ16 లోడింగ్’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ను జత చేశారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్ మేకోవర్ ఎలా ఉంటుందో, ఆయన ఎలాంటి లుక్స్‌తో కనిపిస్తాడోనని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రామ్‌చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్నది.