Game Changer | రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రా మచ్చా మచ్చా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారని తెలిసిందే. ఈ పాటలో రాంచరణ్ స్టైలిష్ డ్యాన్స్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నాడు.
ఇప్పటికే రా మచ్చా మచ్చా సాంగ్ ఫీవర్ నడుస్తోంది. కాగా రాంచరణ్ డ్యాన్స్‌పై కోస్టార్ సమంత చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. రాంచరణ్ డ్యాన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ కామెంట్ పెట్టింది సామ్. ఇప్పుడీ కామెంట్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. రాంచరణ్, సమంత కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాంచరణ్, సామ్ పోటీ పడి మరీ చేసిన డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
గేమ్ ఛేంజర్‌ను 2024 డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సందడి చేయనున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
రా మచ్చా మచ్చా లిరికల్ వీడియో సాంగ్..
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్