ఇప్పటికే బ్లడ్ బ్యాంక్‌ని స్థాపించి ఎందరో ప్రాణాలకు అండగా నిలిచిన చిరంజీవి ఇటీవల తెలుగు రాష్ట్రాలలో.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ అంటూ మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికడుతూ ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ దాదాపు అందుబాటులోకి వచ్చింది.
జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు సేవలందిస్తుండగా, అనంతపురంలో ఆక్సిజన్ అత్యవసరం అని చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకి వచ్చిన వారి నుంచి వివరాలు తెలుసుకుని,ఇంటికే తీసుకెళ్లి స్వయంగా అందచేసారు.ఈ క్రమంలో అనంతపురం టీంని రామ్ చరణ్ ప్రశంసించారు.