Leo Movie | లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’లో భాగంగా సినిమా తెరకెక్కున్నట్లు వార్తలు రావడంతో లియోపై ఎక్కడలేని హైప్ పెరిగింది. దానికి తోడు విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సైతం మిలియన్లలో వ్యూస్‌ను సాధించి.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుడంటంతో మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ క్యామియో పక్కా ఉండనున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ సీన్ మాదిరి లియోలో కూడా ఓ క్రేజీ క్లైమాక్స్‌ను లోకేష్ డిజైన్ చేశాడట. ఈ క్లైమాక్స్‌లో పేరు మోసిన గ్యాంగ్స్టర్లందరూ లియో దగ్గరికి వచ్చే వాళ్లలో చరణ్ కూడా ఒకడిగా ఉండనున్నాడట. ఆ మధ్య రిలీజైన టీజర్ చివరి షాట్లో తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన ఓ ఖరీదైన కారును చూపించారు. దాంతో అదే కారులో చరణ్ ఎంట్రీ ఉంటుందన్న వార్త మరింత బలం చేకూరుస్తుంది. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే అక్టోబర్ 19వరకు వేచి చూడాల్సిందే.
నిజానికి ఈ గాసిప్‌ను నమ్మడంలోనూ పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లోకేష్ లిస్ట్‌లో చరణ్ కూడా ఉన్నాడు. పైగా చరణ్‌తో తీయబోయే సినిమా కూడా ఎల్సీయూలో భాగంగానే తెరకెక్కనుందని సమాచారం. ఈ క్రమంలో లియోలో చరణ్ గెస్ట్ రోల్ పాత్ర పోషించడం నమ్మశక్యంగానే ఉంది. ఇక లోకేష్ ఈ సినిమాను పూర్తి చేసినెంబటే రజనితో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఆపై ఖైదీ-2,విక్రమ్-2, రోలెక్స్ సినిమాలు చేయబోతున్నాడు.