మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేశారు మేకర్స్. పూనే, సతారా, పాల్టన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు.
సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించగా, ఇక్కడ చరణ్, కియారా అద్వాని కాంబోలో కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట.తాజాగా రామ్ చరణ్ ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు రాగా, ఇందులో తమ అభిమాన నటుడిని చూసి మురిసిపోతున్నారు అభిమానులు. అచ్చం ఆరెంజ్ స్టైల్‌ని గుర్తు తెస్తున్నావుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కూడా నేషనల్ పొలిటికల్ డ్రామా గా ఉండబోతోందని సమాచారం. అలాగే సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. ముఖ్యంగా ఒక ట్రైన్ సీన్ కోసం అయితే దర్శకుడు శంకర్ ఏకంగా పది కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందే కేవలం పోస్టర్స్ కోసమే 70 లక్షల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.