Ram Charan |గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా, గత కొన్ని రోజులుగా చిత్రబృందం సినిమా టైటిల్ సాంగ్‌కి సంబంధించిన భాగాలను చిత్రీకరిస్తోంది.అయితే శనివారం, అల్లు కనకరత్నమ్మ మరణంతో చిత్ర యూనిట్ తాత్కాలికంగా షూటింగ్‌కు విరామం ఇచ్చింది. చివరి చూపు కోసం రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి, తన అమ్మమ్మకు ఘనంగా నివాళులర్పించి తిరిగి అదే రోజున మైసూర్‌కి వెళ్లిపోయారు.ఇక ఆదివారం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆహ్వానంతో రామ్ చరణ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో చరణ్.. సిద్ధరామయ్యకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఎం కూడా రామ్ చరణ్‌కి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఇక సిద్ధరామయ్య ‘పెద్ది’ సినిమా గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైసూర్లో చిత్రీకరణ జరుపుకుంటోన్న విషయమై కూడా మాట్లాడినట్టు సమాచారం. రామ్ చరణ్ – సిద్ధరామయ్య కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఈ భేటీపై స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మర్యాదపూర్వకంగా ఈ భేటి జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్య మంత్రితో రామ్ చరణ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక జానీ మాస్టర్ సినిమాకి సంబంధించిన పాటని కొరియోగ్రఫీ చేస్తుండగా, ఇందులో సుమారు 1000 మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో డాన్సర్లతో ఈ సాంగ్‌ని చిత్రీకరిస్తుండడం విశేషం.
ఈ పాట “విజువల్ ఫీస్ట్” అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకోసం రాంచరణ్ స్పెషల్ లుక్ ట్రై చేశారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, ముక్కుపుడకతో పక్కా రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించి సందడి చేయనున్నారు. ఇక చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు. కెమెరామెన్‌గా రంగస్థలం ఫేమ్ రత్నవేలు పనిచేస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి తీసుకున్నారు.