Ram Charan | అభిమాని కోరిక తీర్చిన రామ్చరణ్.. నెట్టింట ప్రశంసల వెల్లువ..!
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కాగా చరణ్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ చిన్నారి చివరి కొరిక తీర్చి ఉదారతను చాటుకున్నాడు.
Ram charan | మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కాగా తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ చిన్నారి చివరి కొరిక తీర్చి ఉదారతను చాటుకున్నాడు. తొమ్మిదేళ్ల మణి కుశాల్ చరణ్కు వీరాభిమాని. అయితే ఆ చిన్నారి గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాదులోని స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా జీవితంలో ఒక్కసారైనా రామ్ చరణ్ ను కలవాలని ఆ చిన్నారి తన కోరికను తల్లిదండ్రులకు తెలిపాడు.
ఈ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారు రామ్చరణ్కు తెలియజేశారు. ఆ చిన్నారి పరిస్థితి తెలుసుకున్న చరణ్ స్పర్శ్ ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స పొందుతున్న మణి కుశాల్ తో కాసేపు సరదాగా గడిపాడు. అంతేకాకుండా ఆ చిన్నారికి ఓ బహుమతిని ఇచ్చాడు. అలాగే మణి త్వరగా కోలుకుంటాడని చిన్నారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గురువారం చార్మినార్ దగ్గర RC15 షూటింగ్ జరుపుకుంటున్న చరణ్.. ఈ విషయం తెలిసుకొని అటునుంచి అటే అభిమానిని కలవడానికి వెళ్లాడు.


Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

