Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా పెద్ది తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగుతోంది. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, విలన్‌గా కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరోవైపు, పెద్ది తర్వాత చరణ్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి.
‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి స్క్రీన్‌పైకి రానుంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వెలువడగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.‘పుష్ప 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా పైన దేశవ్యాప్తంగా హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్గా కృతి సనన్ని తీసుకోవాలన్న ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన ‘వన్ నేనొక్కడినే’లో నటించిన కృతి, తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది.
ఇటీవల ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’లో నటించినా, ఆ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ ఆమెకి ఐరెన్ లెగ్ బిరుదు ఇచ్చింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సరసన కృతి సనన్ నటిస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుండగా, మెగా ఫ్యాన్స్ మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. “ఆమెకు టాలీవుడ్లో విజయవంతమైన ట్రాక్ రికార్డ్ లేదు”, “కథకు సరిపోయే వేరే హీరోయిన్ను తీసుకోవాలి” అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి ఆధికారిక ప్రకటన రాలేదు. సుకుమార్-చరణ్ మూవీ 2026 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నారు.