Ram Charan | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ట్రిపుల్ఆర్ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘దోస్తీ’, ‘నాటు నాటు’ పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. ఇందులో ‘నాటు నాటు’ సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్‌లోనే ఉంది. ఈ పాటను ఉక్రెయిన్‌లో రెండు వారాల పాటు చిత్రీకరించారు.
ఈ వారం రోజుల పాటు రామ్‌చరణ్‌కు బాడీగార్డుగా రూస్టీ అనే వ్యక్తి పనిచేశాడు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ వార్ మూలంగా అక్కడి పరిస్థతులు అందోళన కరంగా ఉన్నాయి. ఈ సందర్భంగా రూస్టీ కూడా దుర్భర పరిస్థతిని ఎదుర్కుంటున్నాడు. ఈ విషయం రామ్‌చరణ్‌కు తెలిసింది. దాంతో ఈయన వెంటనే స్పందించి రూస్టీ కుంటుంబానికి డబ్బులను పంపించాడు. ఆ డబ్బుతో రూస్టీ మందులు, నిత్యావసరాలు కొనుక్కున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థుతుల్లో తమను ఆదుకున్నందుకు రూస్టీ, రామ్‌చరణ్‌కు ఓ వీడియో రూపంలో ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆలీయా భట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టర్ అజయ్‌దేవగణ్ కీలకపాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని 550కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ చిత్రం మార్చి 25న అత్యంత భారీగా విడుదలకానుంది. ప్రస్తుతం ట్రిపుల్ఆర్ బృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతుంది.
#RamCharan has helped a security officer in Kyiv, Ukraine, who previously operated as his personal security member during #RRR’s shoot in Ukrainian @AlwaysRamCharan pic.twitter.com/kAi4OmmIZd
— BA Raju's Team (@baraju_SuperHit) March 19, 2022