రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? అనేది మొన్నటివరకూ మిలియన్ డాలర్ల ప్రశ్న. కనీసం ట్రైలర్ అయినా విడుదల చేస్తే బావుండని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య పాట విడుదల చేయనున్నట్టు వార్తలొచ్చాయి. మళ్లీ ఏమైందో ఏమో.. చడీచప్పుడూ లేదు. ఎట్టకేలకు ‘గేమ్‌ఛేంజర్’ సినిమాకు సంబంధించిన అప్డేట్ను నిర్మాత దిల్‌రాజు రివీల్ చేశారు. ఆయన ‘సలార్’ సినిమా చూసి వస్తూ, మెగా అభిమానులకు చిక్కారు.
వారు అడగడంతో ‘గేమ్‌ఛేంజర్’ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. మెగా అభిమానులకు ఇది పెద్ద శుభవార్తే. రామ్‌చరణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ఛేంజర్’. దక్షిణాది దిగ్దర్శకుడు శంకర్ సామాజిక అంశాల సమాహారంగా, వాణిజ్యఅంశాల మేలుకలయికగా ‘గేమ్ ఛేంజర్’ సినిమాను రూపొందిస్తున్నారు. రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి కథానాయికలు. ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రధారులు.