Game Changer | ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan). ఈ గ్లోబల్ స్టార్ హీరో టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game changer). ఆర్సీ15గా వస్తోన్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాజోలు భామ అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.
ఇవాళ గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షురూ అయింది. దీంతోపాటు వికారాబాద్, శంషాబాద్‌లో కూడా ఓ మినీ షెడ్యూల్ కొనసాగనుండగా. రాంచరణ్‌తోపాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారని ఇన్సైడ్ టాక్. విడుదల తేదీతోపాటు మరిన్ని వార్తలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Game Changer
Game Changer