Game Changer | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
కాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఏదో ఒక అప్డేట్తో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది టీం. గేమ్‌ఛేంజర్ నుంచి ఇటీవలే విడుదల చేసిన మూడో సాంగ్ నానా హైరానా (Naanaa Hyraanaa) ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ థమన్ కంపోజిషన్‌లో కార్తీక్, శ్రేయాఘోషల్ పాడారు.
శంకర్ సినిమాలంటే అందమైన లొకేషన్స్, కలర్ ఫుల్ సాంగ్స్ ఉండాల్సిందే. ఈ పాట కూడా శంకర్ ఆల్ టైమ్ సూపర్ హిట్ కలర్ ఫుల్ ఆల్బమ్స్‌లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన రా మచ్చ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. జరగండి జరగండి సాంగ్‌కు కూడా మంచి స్పందన వస్తోంది.
నానా హైరానా లిరికల్ వీడియో సాంగ్..
అంచనా (ఊహించని) వేయలేని దాని కోసం ప్రిపరేషన్.. అంటూ లాంచ్ చేసిన గేమ్ ఛేంజర్ టీజర్ థీమ్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌కు కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
“Feel the melody weave around, cradle you with its magic”#NaanaaHyraanaa out now♥️🤗https://t.co/QjC7K831lE
A @MusicThaman melodic spell
Sung by: @shreyaghoshal @singer_karthik
Choreography: @BoscoMartis
Lyrics ✍️: @ramjowrites #GameChangerOnJAN10@AlwaysRamCharan…
— Shankar Shanmugham (@shankarshanmugh) November 28, 2024
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Kiran Abbavaram | ఓటీటీలో కిరణ్ అబ్బవరం క చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్