సాయిదుర్గతేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘SDT18’ వర్కింగ్ టైటిల్‌తో సాయిదుర్గతేజ్ కెరీర్లోనే హై బడ్జెట్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఈ నెల 12న హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించనున్నారు. అగ్రహీరో రామ్‌చరణ్ ఈ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసి ‘SDT18 కార్నేజ్’ను లాంచ్ చేయనున్నారు. సాయిదుర్గతేజ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఇదని, ఈ సినిమా ఈవెంట్‌కి రామ్‌చరణ్ అతిథిగా రానుండటం చాలా ఆనందంగా ఉందని మేకర్స్ తెలిపారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్. నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్.