రియల్ హీరో సోనూసూద్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భీకర ఫైట్ చేయనున్నాడట. ఇది రియల్ లైఫ్‌లో కాదులేండి, రీల్ లైఫ్‌లో. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం కోకాపేటలో వేసిన ధర్మస్థలి టెంపుల్ సెట్లో చిత్రీకరణ జరుగుతుంది.
తాజా షెడ్యూల్లో రామ్ చరణ్, సోనూసూద్ మధ్య భీకర ఫైట్‌ను ప్లాన్ చేశాడట కొరటాల శివ. రైన్ ఫైట్‌గా యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో కొరటాల ఈ ఫైట్‌ను ప్లాన్ చేసాడని అంటున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మే 13న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.