My Dear Donga | దొంగతనానికి వెళ్లి లవ్‌లో పడిన అభినవ్.. హిలేరియస్‌గా ‘మై డియర్ దొంగ’ ట్రైలర్
Abhinav Gomatam | టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Abhinav Gomatam | టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!'( Masth Shades Unnai Ra) నీలో అంటూ సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం అభినవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మై డియర్ దొంగ’(My Dear Donga). శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బిఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో నేరుగా ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తే.. సురేష్ (అభినవ్ గోమఠం) పొట్టకూటి కోసం దొంగతనం చేస్తూ.. ఓ అమ్మాయి (శాలినీ కొండెపూడి)కి దొరికితే వాడి కష్టాలు చెప్పి ఆ అమ్మాయికి ఫ్రెండ్ గా ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింటా ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

