కనులపండువగా శ్రీరామ మహాపట్టాభిషేకం
దక్షిణ అయోధ్యాపురిగా పేరుగాంచిన భద్రగిరిలో పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు రాజాధిరాజుగా దర్శనమిచ్చాడు. స్వర్ణ ఛత్రం, పసిడి పాదుక, రాజదండం, రాజముద్ర, వజ్రకిరీటాలతో స్వర్ణ సింహాసనంపై కొలువుదీరిన జగదాభిరాముడు రారాజుగా దర్శనమివ్వడంతో భక్తుల జయజయధ్వానాలతో మిథిలా సామ్రాజ్యం (స్టేడియం) మార్మోగింది.
ఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణ అయోధ్యాపురిగా పేరుగాంచిన భద్రగిరిలో పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు రాజాధిరాజుగా దర్శనమిచ్చాడు. స్వర్ణ ఛత్రం, పసిడి పాదుక, రాజదండం, రాజముద్ర, వజ్రకిరీటాలతో స్వర్ణ సింహాసనంపై కొలువుదీరిన జగదాభిరాముడు రారాజుగా దర్శనమివ్వడంతో భక్తుల జయజయధ్వానాలతో మిథిలా సామ్రాజ్యం (స్టేడియం) మార్మోగింది. భద్రాద్రి రాముడికి మహా పట్టాభిషేకం గురువారం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానం వైదిక సిబ్బంది గోదావరి జలాలతో తీర్థప్రోక్షణ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజు శ్రీరాముడికి మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
బుధవారం జరిగిన కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరై స్వామివారు, సీతమ్మతల్లికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మహా పట్టాభిషేకానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరై రామయ్యకు పట్టువస్ర్తాలను సమర్పించారు. గవర్నర్‌కు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఈవో రమాదేవి ఘనస్వాగతం పలికారు. అర్చకులు దేవస్థానం తరఫున శేషవస్త్రాలు, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్థానాచార్యులు స్థలశాయి శ్రీరామ మహా పట్టాభిషేక విశిష్టతను భక్తులకు వివరించారు. తొలుత శ్రీరామ బంగారు పాదుకలు, అనంతరం రాజదండం, రాజముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతమ్మకు, శ్రీరామ మాడ లక్ష్మణస్వామికి, తామరం, బంగారు ఛత్రం, రాజఖడ్గం, సామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

