‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సాధించిన అఖండ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు అగ్రహీరో రామ్చరణ్. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. దిల్రాజు నిర్మాత. యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ అనంతరం రామ్చరణ్ చేయబోయే సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా అనివార్య కారణావల వల్ల రద్దయిన విషయం తెలిసిందే. దీంతో రామ్చరణ్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
విశ్వసనీయ సమాచారం ప్ర కారం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్చరణ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఓ నూతన నిర్మాణ సంస్థ తెరకెక్కించే ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రొడక్షన్ హౌస్ సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామ్యం కావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం.