శని, ఆదివారాలలో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎంత సందడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున హౌజ్‌మేట్స్‌తో చేసే సందడి పీక్స్‌లో ఉంటుంది. ఈ శనివారం రోజు నాగ్‌తో పాటు రామ్ చరణ్, నితిన్, తమన్నా, నభా నటేష్ బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించిన ప్రేక్షకుల ఆనందాన్ని డబుల్ చేశారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రామ్ చరణ్ శనివారం రోజు బిగ్ బాస్ స్టేజ్‌పై కాసేపు సందడి చేశాడు. స్టార్ గ్రూప్ అనుబంధ సంస్థ డిస్నీ హాట్‌స్టార్ కి చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంతో బిగ్ బాస్ షోకి కూడా కాసేపు హోస్ట్ గా ఉండి అదరగొట్టాడు.
నితిన్ నటించిన తాజా చిత్రం మాస్ట్రో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాగా,దీనికి ప్రమోషన్లో భాగంగా నితిన్‌తో పాటు తమన్నా, నభా కూడా వచ్చారు. మాస్ట్రో సినిమాలో అంధుడిగా నటించిన నితిన్.. బిగ్ బాస్ స్టేజ్ మీదకు కూడా అలానే వచ్చాడు. తమన్నా దగ్గరుండి మరీ నితిన్‌ను తీసుకొచ్చింది. సినిమాలో అందరినీ ఆడించావ్.. ఇక్కడ కూడా అవసరమా? అని నితిన్‌కు చెర్రీ కౌంటర్ వేశాడు చరణ్.
ఆ తర్వాత నితిన్, తమన్నా, నభా నటేష్‌లతో కలిసి రామ్ చరణ్ చిందులేయగా, ఆ తర్వాత నాగ్ మాస్ట్రో టీంని కూడా కలిసి విష్ చేశాడు. అంతకముందు డిస్పీ ప్లస్ హాట్ స్టార్ ప్రమోషన్ కోసం చెర్రీ నటించిన వీడియోని విడుదల చేశారు. ఇది చాలా ఆకట్టుకుంది. ఇక ఇంటి సభ్యులతో కూడా చెర్రీ మాట్లాడగా, వారికి బెస్ట్ విషెస్ అందించాడు.
When @AlwaysRamcharan grooved to the tunes of #Maestro on #BiggBoss tonight
— nithiin (@actor_nithiin) September 18, 2021
Great fun coming your way in just a while.
Watch out for this special show!@IamNagarjuna @Tamannaahspeaks @NabhaNatesh @DisneyPlusHS
#BiggBossTelugu5 @StarMaa @SreshthMovies @GandhiMerlapaka pic.twitter.com/herGiVNKEs