Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) రెండు చిత్రాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి టైటిల్ రోల్ పోషిస్తున్న గేమ్ ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అయితే ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక అప్డేట్స్ రావడం లేదు. ఫస్ట్ సాంగ్ విడుదల కానుండగా.. అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
ఫస్ట్ సింగిల్ Jaragandi పాటను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కానీ ప్రొడక్షన్ టీం మాత్రం సాంగ్ ఎప్పుడనేది ఇప్పటికీ అధికారికంగా తెలుపకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మరి రేపేమైనా సర్ప్రైజ్ ఉండబోతుందా..? లేదా.? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ డ్యుయల్ షేడ్స్‌లో కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు
గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ Saregama దక్కించుకుంది. రాంచరణ్ మరోవైపు బుచ్చిబాబు సాన డైరెక్షన్లో ఆర్సీ 16కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
Get ready for a musical extravaganza 💥
✨Super excited to associate with Mega Powerstar @AlwaysRamCharan & @shankarshanmugh’s #GameChanger 🔥
Brace yourselves for the sensational soundtrack #Jaragandi coming out this Diwali! 🤩
A @MusicThaman musical@advani_kiara… pic.twitter.com/bLCi3kDcOL
— Saregama South (@saregamasouth) November 7, 2023
Get ready for a musical explosion 💥 @saregamaglobal has secured the audio rights of Mega Powerstar @AlwaysRamCharan & @shankarshanmugh’s #GameChanger 🔥
Brace yourselves for the sensational soundtrack #Jaragandi coming out this Diwali! 🤩
A @MusicThaman musical… pic.twitter.com/MO40I7Q0MD
— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2023
గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ లోడింగ్..
#RamCharan #Gamechanger first single on Dussehra
update soon !
— Rajesh Manne (@rajeshmanne1) October 17, 2023