రామ్‌చరణ్ సరికొత్త అవతారంలోకి మారారు. అక్టోబర్ నుంచి ఆయన బుచ్చిబాబు సాన సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఆ సినిమాకోసం గత రెండు నెలలుగా జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు రామ్‌చరణ్. శంకర్ ‘గేమ్‌చేంజర్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్‌ని ఇప్పటికే ఆయన పూర్తి చేసుకున్నారు. ఆ సినిమా డబ్బింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. దానికి ఈ నెలలోనే ఓ పది రోజులు కేటాయించనున్నారు.
వచ్చే నెల నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ లుక్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేశారట బుచ్చిబాబు. అందుకే.. మామూలుగా కంటే ఓ గంట ఎక్కువగానే జిమ్‌లో కష్టపడుతున్నారట చరణ్. క్రీడా నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇది ఇప్పటి జనరేషన్ కథ కాదని, బుచ్చిబాబు ఓ 30ఏళ్లు వెనక్కెళ్లి రాసుకున్న వైవిధ్యమైన కథ అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఏ క్రీడా నేపథ్యంలో ఈ కథ సాగుతుందో మాత్రం చిత్రబృందం చెప్పడంలేదు. అది తెరపైనే చూడాలి. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే. నవంబర్ నుంచి జాన్వీ ఈ షూటింగ్లో పాల్గొంటుందని సమాచారం.