Ram Charan Beast Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) కోసం పూర్తి ‘బీస్ట్ మోడ్’లోకి మారిపోయారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కోసం చరణ్ చేస్తున్న మేకోవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా చరణ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఒక పవర్ఫుల్ ఫోటోను షేర్ చేస్తూ, తదుపరి సవాలుకు సిద్ధంగా ఉన్నాను నిశ్శబ్దంగా తన పనిని కానిస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలో చరణ్ భారీగా కండలు పెంచి, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన శరీరకృతిని పూర్తిగా మార్చేసి గ్రామీణ క్రీడాకారుడి పాత్రకు తగ్గట్టుగా ‘నెవర్ బిఫోర్’ అవతార్‌లోకి మారారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఒక భారీ షెడ్యూల్ కోసం చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. ఇందులో కీలక సన్నివేశాలతో పాటు ఒక ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. ‘పెద్ది’ సినిమాను 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంలో వస్తున్న వాయిదా రూమర్లను చిత్ర యూనిట్ పదేపదే కొట్టిపారేస్తోంది.
ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ ‘చికిరి చికిరి’ ఇప్పటికే ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి గ్లోబల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Ram Charan Beast Mode

Ram Charan