Gandhi Tatha Chettu | టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా రామ్ చరణ్ దంపతులు కూడా ఈ సినిమా చూసి సుకృతి వేణి బండ్రెడ్డి ప్రశంసలు కురిపించడంతో పాటు తాజాగా గాంధీ తాత చెట్టు టీమ్‌ని కలుసుకుని వారికి అభినందనలు తెలిపారు. ఇక రామ్ చరణ్ ఉపాసన కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్‌తో పాటు, దర్శకురాలు పద్మ మల్లాది తదితరులు ఉన్నారు.
మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటనకు గాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదా సాహెబ్ ఫాల్కే, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డు అందుకుంది.
Global Star’s lovely gesture ❤️
GLOBAL STAR @AlwaysRamCharan Garu & @upasanakonidela Garu congratulated the young team of #GandhiTathaChettu for the blockbuster success ❤️🔥
Book your tickets for the BIG HEARTED BLOCKBUSTER now ✨
🎟 https://t.co/ACbmGgHVp2Featuring… pic.twitter.com/rlzrTjyMU0
— Mythri Movie Makers (@MythriOfficial) January 25, 2025