రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే నెలలో రామ్‌చరణ్-సుకుమార్ సినిమా(RC 17)కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెడతారట. 2026 మే నుంచి షూటింగ్‌ను ప్రారంభించాలనేది సుకుమార్ ప్లాన్ అని తెలుస్తున్నది. రామ్‌చరణ్ మాత్రం ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ఓ రెండు నెలలు విరామం తీసుకొని సుకుమార్ సినిమా సెట్లోకి ఎంట్రీ ఇస్తారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్‌ని కూడా సుకుమార్ లాక్ చేశారు.
‘సుకుమార్ నెక్ట్స్ సినిమాలోని హీరో ఎంట్రీ సీన్ కోసం ఎదురు చూస్తున్నా’ అని ఆ మధ్య ఓ వేదికపై రాజమౌళి అన్నారు. సూచాయగా అయినా కథ తెలియకపోతే రాజమౌళి ఆ మాట అనరు అనేది అభిమానుల మాట. దీన్నిబట్టి ఈ సినిమా రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.