Peddi Song Shoot | అగ్ర కథానాయకుడు రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో ‘పెద్ది’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మాస్ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ అందిస్తున్నాడు. అయితే ఈ పాటకు జానీ మాస్టర్‌ను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అయితే లైంగిక ఆరోపణలు వచ్చిన వ్యక్తికి మళ్లీ సినిమా అవకాశం ఎలా ఇస్తారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఈ వివాదంపై నెటిజన్లు స్పందిస్తూ.. ఒక వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా మైనర్‌కు సంబంధించినవి ఉన్నప్పటికీ, సినిమా పరిశ్రమలో అగ్ర నటులు వారికి అవకాశాలు కల్పిస్తున్నారని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో నీతి, నిజాయితీ గురించి ఉపదేశాలు చెప్పే స్టార్స్, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం కళకు సంబంధించిన విషయం కాదని, సమాజంపై ప్రభావం చూపే అంశమని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని, కళాకారులకు నైతిక బాధ్యత ఉండాలని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
F*cking clown show. Man admits to SA*ing a minor and even then the biggest stars employ him while preaching MORALS in their f*cking movies. Absolutely shameless and spineles behaviour https://t.co/tlkoe2dF4p
— V (@VinilTummala) August 28, 2025