Ram | టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.కాని సరైన సక్సెస్ పడడం లేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ మంచి హిట్ కొట్టింది లేదు. ఇప్పుడు ప్రేమ కథతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు రామ్. మాస్ మంత్రం జపిస్తూ గుబురు గడ్డంతో రచ్చ చేసిన దానికి సరైన ఆదరణ దక్కలేదు. ఇప్పుడు స్లిమ్ అండ్ క్లీన్ లుక్‌లో అమ్మాయిల మనసు దోచే విధంగా హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించనున్నాడు రామ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ‘RAPO22గా ఈ మూవీ రూపొందుతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేం పి.మహేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సేకథానాయికగా నటిస్తుంది.
చిత్రాన్ని మూవీ ఇండస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఈ రోజు రామ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. గ్లింప్స్‌లో సినిమా థియేటర్ లో.. టికెట్ల కోసం పలుకు బడిని వాడటం.. ఎమ్మెల్యే, పోలీస్ తాలుకా అంటూ టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేయడం.. తర్వాత ఆంధ్రా కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా? అని చెప్పడం.. మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి.. ఆంధ్ర కింగ్ తాలుకా అని యాభై టికెట్లు తీసుకోవడవం వంటివి చూస్తుంటే నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోపిక్ మాదిరిగానే అనిపిస్తుంది. చిత్రంలో సినిమా హీరో అభిమానిగా రామ్ కనిపించనున్నట్టు అర్ధమవుతుంది.
చిత్రంలో సాగర్ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. వీరి మధ్య ఓ అందమైన లవ్ స్టోరీ కూడా ఉండబోతోందని అర్ధమవుతోంది. వివేక్ మెర్విన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రామ్, భాగ్య శ్రీ చాలా హోప్స్ పెట్టుకున్నారు. భాగ్య శ్రీకి మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ ఉండిపోయింది. అందులో గ్లామర్ బాగానే ఒలికించిన లక్ కలిసి రాలేదు. మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్ అయి ఉంటే భాగ్య శ్రీకి మరిన్ని ఆఫర్లు వచ్చి ఉండేవి. మరి రామ్‌తో చేస్తున్న ఈ మూవీ భాగ్యశ్రీ రాత మారుస్తుందా లేదా చూడాలి. రామ్‌కి కూడా ఈ మూవీ సక్సెస్ అనేది చాలా అవసరం.