
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. తెలుగులోరకుల్ నటించిన కొండ పొలం చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. బ్యూటీడాల్గా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో పిచ్చెక్కించే రకుల్ తాజాగా కిల్లింగ్ ఫొటోస్ షేర్ చేసింది. రకుల్‌ని ఇలా చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం రకుల్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రకుల్ ఈ మధ్య తన శరీరంలో ఓ భాగానికి చిన్న మార్పుతో ఆపరేషన్ చేయించుకుందని వార్తలు వచ్చాయి. మారి దానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు.
రకుల్ ప్రస్తుతం అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తుంది. ఎటాక్, మేడే, థాంక్ గాడ్, డాక్టర్ జీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ లిస్టులో ఓ తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం.