Rakul preeth singh | తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఇంట్రడక్షన్ అసవసరం లేని భామల్లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preeth singh). మహేశ్ బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున లాంటి లీడ్ యాక్టర్లతో నటించి వన్ ఆఫ్ లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం హిందీ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ నెట్టింట చురుకుగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani )తో కలిసి యోగాసనాలు వేసింది రకుల్.
జాకీ భగ్నానీ-రకుల్.. ఇద్దరూ కలిసి బ్యాలెన్సింగ్‌గా (acroyoga pose) ఆక్రోయోగా (ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే యోగా)
చేసి ఔరా అనిపిస్తున్నారు. అందరం కలిసి ఆరోగ్యంగా.. అందంగా ఉందాం..మీ అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అని క్యాప్షన్ ఇచ్చారు ఈ స్టార్ కపుల్. తన సతీమణి ఫిట్‌నెస్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు జాకీ భగ్నానీ. ఈ స్టార్ కపుల్ డెడికేషన్‌కు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం శంకర్-కమల్ హాసన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో నటిస్తోన్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఆక్రోయోగా ఇలా..