Rakul Preet Singh | సెల్ఫీ తో రకుల్ సర్ప్రైజ్.. నెటిజన్ల స్పందన ఇదే..!
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే భామల్లో టాలీవుడ్ (Tollywood) భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. ఎప్పటికపుడు కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లలో జోష్ నింపుతుంది రకుల్.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే భామల్లో టాలీవుడ్ (Tollywood) భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. ఎప్పటికపుడు కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లలో జోష్ నింపుతుంది రకుల్. అయితే ఈ బ్యూటీ హఠాత్తుగా కొత్త లుక్ లో దర్శనమిచ్చింది. సెల్ఫీ లుక్ తో అందరినీ పలుకరించింది. బార్బీ డాళ్ లా మెరిసిసోతూ క్లోజప్ సెల్ఫీ (close up Selfie) దిగింది. మెడలో పలు రకాల చైన్లతో గ్లామరస్ గా మేకప్ వేసుకుని సరికొత్తగా కనిపిస్తోంది. రకుల్ లుక్ లో కనిపిస్తున్న ఈ భారీమార్పు గురించి నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెట్టారు.
ఏది ఏమైనా రకుల్ బాగా క్లీన్ గా కనిపిస్తున్న పెదవులు, చూడముచ్చటైన చెంపలతో అందంగా కనిపిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. హాట్ నెస్ అంటూ లక్ష్మీ మంచు కామెంట్ పెట్టింది. అయితే రకుల్ మాత్రం ఈ సెల్ఫీని డిమాండ్ మేరకే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశానని చెప్తూనే..లండన్ హ్యాష్ ట్యాగ్ ను జోడించింది రకుల్. రకుల్ ఈ పోస్టుతో తాను లండన్ లో ఉన్నానని పరోక్షంగా చెప్తుందేమోనని అంతా అనుకుంటున్నారు.

సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కొండపొలం చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హీరో. కాగా హిందీలో మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, అయలాన్ తోపాటు మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టింది.
ఇవి కూడా చదవండి..
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

