Rakul Preet Singh | సేఫ్టీ బెల్ట్ లేకుండా 80 కిలోల బరువు.. 40 రోజులు నరకం చూశానన్న రకుల్ ప్రీత్ సింగ్!
Rakul Preet Singh | ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాను గతంలో ఎదుర్కొన్న ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య గురించి సంచలన విషయాలను వెల్లడించారు.
Rakul Preet Singh | ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాను గతంలో ఎదుర్కొన్న ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య గురించి తాజాగా వెల్లడించింది. జిమ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వర్కవుట్ చేయడం వల్లే తాను పెద్ద ప్రమాదంలో పడ్డానని ఆమె తెలిపారు. ఇటీవల నేహా ధూపియా, అంగద్ బేడీలు నిర్వహిస్తున్న ‘డబుల్ డేట్’ టాక్ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్, ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిమ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో ఎలాంటి సేఫ్టీ బెల్ట్ ధరించకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తడానికి ప్రయత్నించానని, ఆ చిన్న పొరపాటు వల్ల తనకు తీవ్రమైన స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని చెప్పారు. ఆ గాయం కారణంగా తాను ఏకంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రైనర్లు ఏం చెప్పినా సరే, డెడ్‌లిఫ్ట్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాయామమని, అది కేవలం ఒక ఇగో లిఫ్ట్ మాత్రమేనని రకుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రమాదం వల్ల కనీసం కదలలేని స్థితికి చేరుకున్నానని, నరాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని వివరించారు. ఎప్పుడూ ఎంతో చురుకుగా ఉండే తాను, కనీసం రోజువారీ పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి రావడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ గాయం తనను శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎంతో కృంగదీసిందని రకుల్ కన్నీరు పెట్టారు. అయితే, ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన భర్త జాకీ భగ్నానీ తనకు కొండంత అండగా నిలిచి ఎంతో ధైర్యాన్ని అందించారని ఆమె కొనియాడారు. 2024 ఫిబ్రవరిలో గోవా వేదికగా వివాహం చేసుకున్న ఈ జంట, తమ వైవాహిక బంధానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా ఈ షోలో పంచుకున్నారు. ప్రస్తుతం రకుల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

