Rakul Preet Singh | ‘జాకీలోని సెన్స్ ఆఫ్ హ్యూమరే మొదట నన్ను ఆకర్షించింది. తనతో ఉంటే సమయం తెలీదు.’ అంటూ తన భర్త ముచ్చట్లు చెప్పుకొచ్చింది అందాలభామ రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవలే అస్సాంలో ఓ కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది రకుల్. ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలో తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అని రకుల్ భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ చెప్పగా.. ఆ పక్కనే ఉన్న రకుల్ ‘అది మాత్రం నిజం.
తను నవ్వుతూ, పక్క ఉన్న వారందర్నీ నవ్విస్తాడు. అందర్నీ సంతోషంగా ఉండేలా చూడటం అతని ప్రత్యేకత. అందుకే ఆయన్ను ఇష్టపడ్డాను. జాకీ అద్భుతమైన హాస్య చతురత కలిగిన వ్యక్తి.. అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి. అటువంటి మనిషి నా భర్త కావడం నా అదృష్టం’ అంటూ తన భర్తను పొగడ్తలతో ముంచెత్తింది రకుల్.