టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ఛత్రివాలి (Chhatriwali). తేజాస్ ప్రభ విజయ్ డియోస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. జీ5 ఒరిజినల్ మూవీగా వస్తున్న ఈ చిత్రం ప్రీమియర్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. 2023 జనవరి 20న జీ5లో ప్రీమియర్ కానుంది.
రకుల్ సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు జనవరి 20 నుంచి షురూ అంటూ ప్రీమియర్ తేదీ తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఛత్రివాలిపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ వెబ్ మూవీలో సుమీత్ వ్యాస్, సతీశ్ కౌశిక్, డాలీ అహ్లువాలియా, రాజేశ్ తాయిలాంగ్తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఎస్వీపీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మంగేశ్ ధడ్కే సంగీతం అందిస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కమల్ హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఇండియన్ 2లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు మేరీ పత్నీ కా రీమేక్, అయలాన్, 31 అక్టోబర్ లేడీస్ నైట్ చిత్రాల్లో నటిస్తోంది.